కృష్ణా జిల్లా మొవ్వ మండలం చినముత్తేవి గ్రామపంచాయతీ కార్యదర్శి యెండూరి సాయి. ఫణీంద్ర కుమార్ ను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ డికె.బాలాజీ ఉత్తర్వులు జారీ చేసినట్లు ఎండివో డి.సుహాసిని గురువారం విలేకరులకు తెలిపారు. ఆమె అందించిన వివరాల మేర మార్చి 29వ తేదీన డిపివో జె.అరుణ క్షేత్ర స్థాయి పర్యటనలో భాగంగా ఇంటి పన్నుల వసూళ్ల వేగవంతంపై నిర్లక్ష్యం వహించగా ఈ చర్యలు చేపట్టినట్లు ఎండివో తెలిపారు.