పెడన బీజీకే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గత విద్యా సంవత్సరంలో పదో తరగతి ఫలితాల్లో 76 మంది విద్యార్థులు ఫెయిల్ కావడంతో విద్యాశాఖ అధికారి పీవీజే రామారావు గురువారం పాఠశాలలో తనిఖీ చేశారు. ఉపాధ్యాయుల నిర్లక్ష్యం, పాఠశాలలో సాగుతున్న పరిస్థితులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ అధికారులపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఉపాధ్యాయుల పనితీరుపై ఆయన అసహనం వ్యక్తం చేశారు.