పెడన: అర్జీలను గడువులోగా పరిష్కరించాలి

పెడన నియోజకవర్గంలో గత నాలుగు వారాలుగా అందిన అన్ని పిటిషన్లను పూర్తిస్థాయిలో పరిష్కరించి, తదుపరి ఫిర్యాదులు లేకుండా చూడాలనేదే ప్రభుత్వ లక్ష్యమని జిల్లా ఇన్‌చార్జి డీఆర్ఓ పి. పోతురాజు పేర్కొన్నారు. శుక్రవారం పెడనలో మీకోసం కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజలు తమ సమస్యలపై ఇచ్చిన ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరిస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో సాంబశివరావు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్