కృష్ణా జిల్లా ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడు ఆదేశాల మేరకు, పెడనలో మంగళవారం రాత్రి జిల్లా వ్యాప్తంగా పోలీస్ అధికారులు, సిబ్బంది ముమ్మర వాహన తనిఖీలు, 'విజిబుల్ పోలీసింగ్' నిర్వహించారు. రోడ్డు ప్రమాదాల నివారణ, అక్రమ రవాణాను అడ్డుకోవడం, అవాంఛనీయ సంఘటనలను నివారించడం ఈ తనిఖీల లక్ష్యం. ఈ సందర్భంగా పలు వాహనాలను ఆపి, పత్రాలను పరిశీలించారు.