కంకిపాడు: జిఎస్డబ్ల్యూఎస్ ఆఫీసర్ గా బాపూజీ

కంకిపాడు మండల జిఎస్ డబ్ల్యూఎస్ (గ్రామ, వార్డు సచివాలయాల పర్యవేక్షణ) మండల అధికారిగా దివి బాపూజీ నియమితులయ్యారు. సోమవారం ఆయన నియామకపత్రాన్ని కంకిపాడు మండల ఇంచార్జ్ ఎంపీడీవో బసవయ్య చేతుల మీదుగా అందుకున్నారు. ఈ సందర్భంగా మండల పరిధిలోని గ్రామపంచాయతీ కార్యదర్శులు, గ్రామ సచివాలయాల సిబ్బంది, మండల పరిషత్ కార్యాలయం సిబ్బంది బాపూజీని అభినందించారు.

సంబంధిత పోస్ట్