యనమలకుదురు శివాలయంలో వెలుగులోకి వచ్చిన అక్రమాలపై దేవాదాయ శాఖ ఏర్పాటు చేసిన కమిటీ దర్యాప్తు చేపట్టింది. గతంలో ఈవోగా పనిచేసిన గంగాధర్ వ్యవహారాలను కమిటీ పరిశీలిస్తోంది. ఆలయ భూముల లీజులు, ఎన్ఎసీలకు సంబంధించిన ఫైల్స్ ను పరిశీలిస్తూ, ట్రస్ట్ కార్యకలాపాల్లో నిబంధనల ఉల్లంఘన జరిగిందా అనే అంశంపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఇటీవల వెలుగు చూసిన హుండీ నగదు చోరీపై సైతం విచారణ కొనసాగుతోంది.