కంకిపాడు మండలం గొల్లగూడెంలో ఎమ్మెల్యే బోడే ప్రసాద్ పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో పారిశుద్ధ్య నిర్వహణ లోపం, అధికారుల తీరుపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. 90 శాతం డ్రైయిన్లు పూర్తయినా గ్రామంలో చెత్త పేరుకుపోవడం, మురుగునీరు రోడ్లపైకి రావడం దారుణమని, అధికారులు పనితీరు మార్చుకోకపోతే కఠిన చర్యలు తప్పవని ఎమ్మెల్యే హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.