ఉయ్యూరులో శనివారం సాయంత్రం రూరల్ ఎస్సై సురేష్ ఆధ్వర్యంలో ట్రాఫిక్ నిబంధనల అమలులో భాగంగా వాహనాల తనిఖీలు నిర్వహించారు. సరైన పత్రాలు లేని వాహనదారులకు జరిమానాలు విధించారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, ముఖ్యంగా హెల్మెట్ ధరించాలని ఎస్సై సూచించారు. మైనర్లకు వాహనాలు ఇస్తే వారి తల్లిదండ్రులపై చర్యలు తీసుకుంటామని ఎస్సై సురేష్ హెచ్చరించారు. ఈ తనిఖీలు ప్రజలలో ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన పెంచేందుకు ఉద్దేశించబడ్డాయి.