భూ వివాదాలు లేని జిల్లాగా చేయడమే మా లక్ష్యం: కలెక్టర్

ఎన్టీఆర్ జిల్లాను భూ వివాదాలు లేని జిల్లాగా తీర్చిదిద్దడమే తమ ప్రధాన లక్ష్యమని కలెక్టర్ లక్ష్మీశ స్పష్టం చేశారు. విస్సన్నపేట మండలం నరసాపురంలో శుక్రవారం నిర్వహించిన పిజిఆర్ఎస్ లో ఆయన మాట్లాడారు. జిల్లా కేంద్రానికి రాలేని వారు ప్రతి శుక్రవారం నియోజకవర్గాల్లో జరిగే పిజిఆర్ఎస్ లో తమ సమస్యలను విన్నవించుకోవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో జేసీ ఇలక్కియా, ఆర్డీవో కుమార్, బుడ్డియ్య, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్