జిల్లా కలెక్టర్ లక్ష్మీశ మంగళవారం ఎ. కొండూరు మండలంలోని వెస్ట్ మాధవరంలో పర్యటించారు. క్షేత్రస్థాయి తనిఖీల్లో భాగంగా రూ. 33 వేలతో ఉపాధి హామీ పథకం అనుసంధానంతో ఏర్పాటు చేసిన నీటి తొట్టెలను పరిశీలించారు. ఈ తొట్టెల నిర్వహణపై పంచాయతీరాజ్, పశుసంవర్ధక శాఖల అధికారులు పర్యవేక్షణ చేస్తున్నారని తెలిపారు. తీవ్ర ఎండల నేపథ్యంలో పశువులు, పక్షులకు ఈ నీటి తొట్టెలు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని కలెక్టర్ పేర్కొన్నారు.