వచ్చే ఒకట్రెండు సంవత్సరాల్లో ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్త తయారు కావాలనేది లక్ష్యమని కలెక్టర్ లక్ష్మీశ పేర్కొన్నారు. ఇందుకోసం స్వయం సహాయక సంఘాల మహిళలకు శిక్షణ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నట్లు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో 2025-26లో స్వయం సహాయక సంఘాలకు దాదాపు రూ. 675 కోట్ల మేర బ్యాంక్ లింకేజీని లక్ష్యంగా నిర్దేశించామన్నారు. స్త్రీ నిధి కింద రూ. 133 కోట్లు, ఉన్నతి కింద రూ. 9.70 కోట్లు లక్ష్యంగా ఉందన్నారు.