విజయవాడ: 41 వాహనాలకు జరిమానా

అయ్యప్ప నగర్ ప్రాంతంలో మంగళవారం సాయంత్రం పటమట సీఐ పవన్ కిషోర్ ఆధ్వర్యంలో వాహన తనిఖీలు జరిగాయి. ఈ తనిఖీల్లో వాహనాల పత్రాలు, లైసెన్సులు, హెల్మెట్ వాడకం, ట్రిపుల్ రైడింగ్ వంటి అంశాలను పరిశీలించారు. నిబంధనలు ఉల్లంఘించిన 41 వాహనాలపై కేసులు నమోదు చేసి జరిమానాలు విధించారు. రోడ్లు ఆక్రమించి వ్యాపారం చేస్తున్న వారికి కౌన్సెలింగ్ ఇచ్చి, వాహనదారులు రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్