విజయవాడ: భారీగా వరద.. ప్రకాశం బ్యారేజీ 70 గేట్లు ఎత్తివేత

కృష్ణా నదికి భారీగా వరద నీరు వస్తుంది. ఎగువ నుంచి పెద్దఎత్తున నీరు వస్తుండటంతో ప్రకాశం బ్యారేజీలో 40 గేట్లు 7 అడుగులు, 30 గేట్లు 6 అడుగుల మేర ఎత్తి 2,89,650 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదిలారు. నదికి పక్కన నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. సీతానగర్ వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

సంబంధిత పోస్ట్