ఏపీ లిక్కర్ కేసులో నిందితుల ఆస్తులు జప్తు చేయడానికి విజయవాడ కోర్టు శుక్రవారం అనుమతి ఇచ్చింది. మొత్తం రూ.32 కోట్ల విలువైన ఆస్తులు సీజ్ చేసేందుకు అధికారులకు అనుమతి లభించింది. ప్రతివాదులకు ఆగస్టు 1లోపు నోటీసులు ఇవ్వాలని దర్యాప్తు అధికారులను కోర్టు ఆదేశించింది. నిందితుల ఆస్తుల జప్తుపై గతంలోనే ఏపీ ప్రభుత్వం జీవో విడుదల చేసిన విషయం తెలిసిందే.