ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి బిగ్ షాక్ తగిలింది. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో విజయసాయిరెడ్డికి సిట్ గురువారం నోటీసులు జారీ చేసింది. జులై 12 ఉదయం 10.గంటలకు విచారణకు హాజరుకావాలని పేర్కొంది. మద్యం కుంభకోణం గురించి కొన్ని విషయాలు తెలుసుకునేందుకు సిట్ నోటీసులు ఇచ్చినట్లు సమాచారం. కాగా, లిక్కర్ స్కాం కేసులో VSR గతంలో విచారణకు హాజరైన విషయం తెలిసిందే.