బుధవారం ఉదయం 8 నుంచి 9:30 గంటల వరకు నక్కల రోడ్డు ఫీడర్ పరిధిలో విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఈఈ కొండలరావు తెలిపారు. విద్యుత్ లైన్ల మరమ్మతుల కారణంగా ఏలూరు రోడ్డులోని ఘోరీల దొడ్డి, సోనోవిజన్, విష్ణువర్ధనరావు వీధి, పీసపాటివారి వీధి, తాడేపల్లి వారి వీధి, కోకా చలపతిరావు వీధి, డోర్నకల్ రోడ్, ఎండోకేర్ ఆసుపత్రి పరిసర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోనుంది.