విజయవాడ కొత్త ప్రభుత్వ ఆసుపత్రిలో శానిటేషన్ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. మూడు నెలలుగా పెండింగ్లో ఉన్న జీతాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ కార్మికులు ఆందోళనకు దిగారు. దీంతో ప్రభుత్వ ఆసుపత్రిలో పారిశుధ్య సమస్య తీవ్రమైంది. మెడికల్ వ్యర్థాలు ఆసుపత్రిలో చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ప్రభుత్వం వెంటనే స్పందించి శానిటేషన్ కార్మికుల సమస్యను పరిష్కరించాలని, తద్వారా పారిశుధ్య సమస్యను అధిగమించాలని పలువురు కోరుతున్నారు.