లిక్కర్ కేసులో సీజ్ చేసిన సొమ్మును బ్యాంక్‌లో డిపాజిట్ చేయాలని విజయవాడ ఏసీబీ కోర్టు గురువారం ఆదేశించింది. విజయవాడ మాచవరం SBI బ్యాంకులో సీజ్ చేసిన రూ.11 కోట్లు సొమ్మును డిపాజిట్ చేయాలని సిట్‌కు న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది. నిన్న శంషాబాద్ కాచారంలో రూ.11 కోట్లు లిక్కర్ ముడుపుల డబ్బు సీజ్ చేసినట్లు కోర్టులో సిట్మె మో దాఖలు చేసిన సంగతి తెలిసిందే.