విజయవాడలో విఎంసి డైరీని ఆవిష్కరించిన నగర మేయర్

విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ (విఎంసి) మేయర్ రాయన భాగ్యలక్ష్మి బుధవారం తన చాంబర్‌లో అధికారులతో కలిసి విఎంసి డైరీని ఆవిష్కరించారు. ఈ డైరీ మున్సిపల్ కార్పొరేషన్ అందించే అన్ని సేవలను ప్రజలకు సమగ్రంగా అందుబాటులోకి తీసుకురావడానికి రూపొందించబడిందని ఆమె వివరించారు. నగరవాసులకు ఉపయోగపడే ముఖ్యమైన సమాచారం, మౌలిక వసతులు, శుభ్రత, ఆరోగ్యం వంటి వివిధ అంశాలపై అవగాహన పెంచడానికి ఈ డైరీ ఉపయోగపడుతుందని మేయర్ తెలిపారు.

సంబంధిత పోస్ట్