దివ్యాంగుల సమస్యలు పరిష్కరిస్తా.. సీఎం చంద్రబాబు భరోసా

దేశంలో ఎక్కడా కూడా పింఛన్లకు రూ.6 వేలు ఇచ్చే ప్రభుత్వం లేదని.. ఒక్క ఏపీలో మాత్రమే ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. రూ.3 వేల పింఛన్‌ను రూ.6వేలకు పెంచామని గుర్తుచేశారు. 63లక్షల 50వేల మందికి ప్రతి నెలా ఒకటో తేదీనే ఇళ్లకు వెళ్లి పెన్షన్ ఇస్తున్నామని వివరించారు. దివ్యాంగులపై తమ ప్రభుత్వానికి ఉన్న కమిట్‌మెంట్ ఇదని పేర్కొన్నారు. విభిన్న ప్రతిభావంతులు కాబట్టే... అనేక రంగాల్లో రాణిస్తున్నారని చెప్పుకొచ్చారు. ఇవాళ(బుధవారం) తుమ్మలపల్లి కళాక్షేత్రంలో విభిన్న ప్రతిభావంతుల దినోత్సవ సభలో సీఎం చంద్రబాబు, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. పలువురు దివ్యాంగులను సన్మానించారు. అనంతరం ప్రసంగించారు సీఎం చంద్రబాబు.

సంబంధిత పోస్ట్