ట్రాఫిక్ రద్దీని తగ్గించి, రవాణాను సజావుగా సాగించేందుకు పోలీసులు చర్యలు ముమ్మరం చేశారు. టాక్టికల్ అర్బనిజమ్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం సాయంత్రం NRP రోడ్ పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్ నిర్వహించారు. రోడ్లు, ఫుట్పాత్లపై ఉన్న ఆక్రమణలను తొలగించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ, రోడ్లపై ఆక్రమణలు చేయకుండా ప్రజలు సహకరించాలని సీఐ సుధాకర్, ఎస్ఐ కుమార్ తెలిపారు.