విజయవాడ: కలెక్టరేట్ పిజిఆర్ఎస్కు 174 వినతులు

విజయవాడ కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్కు మొత్తం 174 అర్జీలు అందాయి. కలెక్టర్ జి. లక్ష్మీశ తెలిపిన వివరాల ప్రకారం, రెవెన్యూ శాఖకు 66, పురపాలక శాఖకు 26, పోలీస్ శాఖకు 18 వినతులు వచ్చాయి. ప్రతి అర్జీని నిర్దిష్ట గడువులోగా పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. పారదర్శకమైన సేవలందించడంలో నిర్లక్ష్యం వహించవద్దని కలెక్టర్ స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్