విజయవాడ: పెట్రోల్ సమస్య.. రంగంలోకి పోలీస్ బాస్

ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా పెట్రోల్ బంకుల వద్ద ప్రజలు బారులు తీరడంతో సీపీ రాజశేఖర్ బాబు రంగంలోకి దిగారు. విజయవాడలోని పెట్రోల్ బంకుల వద్ద నిల్వల వివరాలను సేకరించారు. ప్రతి పెట్రోల్ బంక్ వద్ద ఇద్దరు పోలీసులను విధుల్లో ఉంచి, వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టారు. మంగళవారం రాత్రి బందర్ రోడ్డులో పెట్రోల్ సాధారణ పరిస్థితికి రావడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్