విజయవాడ కృష్ణలంక పోలీసులు శుక్రవారం కీలక ప్రకటన చేశారు. కృష్ణా నదిలో స్నానం ఆచరించేందుకు ఎటువంటి అనుమతులు లేవని సీఐ నాగరాజు శుక్రవారం తెలిపారు. కృష్ణానదిలో భయంకరమైన మొసళ్లు, సుడిగుండాలు ఉన్నాయన్నారు. కావున స్నానమాచరించుటకు ఎటువంటి అనుమతులు లేవని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.