విజయవాడలో ట్రాఫిక్ ఇబ్బందులను నివారించేందుకు జిల్లా పోలీస్ కమిషనరేట్ ఆదేశాల మేరకు పోలీసులు బుధవారం ప్రత్యేక చర్యలు చేపట్టారు. వన్స్టీన్ ఏసీపీ రామచంద్రరావు నేతృత్వంలో కేఆర్ మార్కెట్ నుంచి భావనారాయణ వీధి వరకు రహదారికి ఇరువైపులా ఉన్న ఆక్రమణలను తొలగించారు. రోడ్డును ఆక్రమించి ఏర్పాటు చేసిన దుకాణాల వస్తువులను, అడ్డదిడ్డంగా పార్కింగ్ చేసిన వాహనాలను సిబ్బంది తరలించారు. ఈ చర్యలతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ సజావుగా సాగే అవకాశం ఉంది.