విజయవాడలోని కొత్త ప్రభుత్వ ఆసుపత్రిలో శానిటేషన్ కార్మికులు మూడు నెలలుగా పెండింగ్లో ఉన్న జీతాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ సోమవారం అర్ధరాత్రి నుంచి సమ్మెను ఉద్ధృతం చేశారు. దీంతో ఆసుపత్రి పరిసరాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న మాచవరం సీఐ వెంకటరమణ, ఎస్సై సంధ్య ఘటనా స్థలానికి చేరుకుని కార్మికులతో చర్చలు జరిపారు.