ప్రభుత్వాసుపత్రిలో ప్రసవాలు.. అగ్రస్థానంలో కర్నూలు జిల్లా

కర్నూలు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రుల్లో అత్యధిక ప్రసవాలు నిర్వహించి ఏపిలోనే ప్రథమ స్థానం సాధించింది. 2025 ఏప్రిల్ నుండి 2026 ఫిబ్రవరి వరకు 11 నెలల కాలంలో 5500 ప్రసవాల లక్ష్యానికి మించి 145 శాతంతో 7982 ప్రసవాలు జరిగాయి. ఇందులో 5881 సాధారణ ప్రసవాలు, 2101 సిజేరియన్ కాన్పులు జరిగాయి. 30 శాతం మించకూడని సిజేరియన్ కాన్పులను జిల్లాలో 26 శాతానికే పరిమితం చేసి, సాధారణ కాన్పులకు ప్రాధాన్యత ఇచ్చారు. ఆదోని, ఎమ్మిగనూరు, పత్తికొండ, ఆలూరు, కోడుమూరు, వెల్దుర్తి, ఓర్వకల్లు వంటి ఆస్పత్రుల్లో ఈ ప్రసవాలు జరిగాయని కలెక్టర్ డా. ఏ. సిరి తెలిపారు.

సంబంధిత పోస్ట్