ఎల్కే తండా: భూములు వదులుకునే ప్రసక్తే లేదని రైతుల ఆందోళన

గడివేముల మండలం ఎల్‌కే తాండలో పవర్ సోలార్ ప్రాజెక్ట్ వలన భూములు కోల్పోయిన గిరిజన రైతులకు నష్టపరిహారం అందించాలంటూ గురువారం జిపిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రాజు నాయక్ ఆధ్వర్యంలో ఆందోళన జరిగింది. 2023 నుండి రైతులకు పరిహారం ఇవ్వకుండా, వారి భూములు సోలార్ కంపెనీకి బదిలీ చేసినందుకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు న్యాయం జరగకపోతే పెద్ద ఆందోళన ఉంటుందని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్