బ్యాంకు రుణం రాని గృహాలు రద్దు: మున్సిపల్ కమిషనర్ కృష్ణ తెలిపారు. గురువారం ఆదోని టౌన్ మున్సిపల్ కమిషనర్ కృష్ణ మాట్లాడుతూ పట్టణంలో 4, 720 టిడ్-కో గృహాలు ఉన్నాయని, అందులో 4, 208 గృహాలను లబ్ధిదారులకు అప్పగించారని తెలిపారు. మిగిలిన 512 గృహాలకు రుణం మంజూరు కాకపోవడంతో, 15 రోజుల్లోగా టిడ్-కో అధికారులకు అర్జీలు ఇవ్వాలని, లేని పక్షంలో అవి ఇతరులకు కేటాయించబడతాయని స్పష్టం చేశారు.