ఆదోని పురపాలక కౌన్సిల్ సమావేశం గురువారం ఛైర్పర్సన్ లోకేశ్వరి అధ్యక్షతన జరిగింది. 37 అంశాలతో పాటు రెండు టేబుల్ అజెండాలను చర్చించారు. బసాపురం ఎస్సీ స్టాండ్ పునర్నిర్మాణం, నీటి సమస్యపై చర్యలు తీసుకోవాలని బాలాజీ యాదవ్ కోరారు. తమ వార్డులో సమస్యలు పరిష్కరించడంలేదని సభ్యురాలు పార్వతి తెలిపారు. అధికారులు, సభ్యులు హాజరయ్యారు.