ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో గురువారం సాయంత్రం రెవెన్యూ డివిజన్ పరిధిలోని రీ సర్వేపై శిక్షణ కార్యక్రమం జరిగింది. సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ ఎఫ్.పి.ఓ.ఎల్.ఆర్ అధికారులకు 62 గ్రామాల్లో జరగనున్న రీ సర్వే వివరాలు తెలిపారు. భూ సరిహద్దులు సరిచేసి ప్రజలకు పారదర్శకమైన, శాశ్వత భూ పత్రాలు అందించడమే ఈ ప్రాజెక్టు లక్ష్యమన్నారు.