బాసాపురం వాటర్ పంప్ హౌస్‌, ఎస్‌ఎస్ కాలువ పరిశీలన

ఆదోని డివిజన్ పరిధిలోని బాసాపురం వాటర్ పంప్ హౌస్, ఎస్ఎస్ కాలువను గురువారం కమిషనర్, ఎంఈ, డీఈ అధికారులు పరిశీలించారు. తాగునీటి సరఫరా, పంపింగ్ వ్యవస్థ పనితీరు, కాలువ పరిస్థితులపై సమీక్షించారు. పంప్ హౌస్ మోటార్లు, పైపులైన్ వ్యవస్థ, నీటి సరఫరా సామర్థ్యాన్ని పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు. ఎస్ఎస్ కాలువలో నీటి ప్రవాహం సక్రమంగా కొనసాగేందుకు చర్యలు తీసుకోవాలని, ప్రజలకు అంతరాయం లేకుండా తాగునీటి సరఫరా నిర్వహించాలని ఆదేశించారు. నిర్వహణ పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ సమస్యలు తలెత్తకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

సంబంధిత పోస్ట్