ఆదోనిలో రసాభాసగా బడ్జెట్ సమావేశం

ఆదోని పురపాలక సంఘం బడ్జెట్ సమావేశం బుధవారం చైర్ పర్సన్ లోకేశ్వరి అధ్యక్షతన రసాభాసగా సాగింది. సభ్యులు తమకు కనీస గౌరవం లేదని, గణతంత్ర దినోత్సవానికి పిలుపు లేదని, ఆమోదించని అంశాలను మినిట్స్‌లో చేర్చారని తీవ్రంగా వాదించారు. ప్రజా సమస్యలపై వాదోపవాదాలు చోటు చేసుకున్నప్పటికీ, చైర్పర్సన్ సముదాయంతో సమావేశం శాంతంగా ముగిసింది. ఈ సమావేశంలో కమిషనర్ కృష్ణ, సత్యనారాయణ, సహాయ కమిషనర్ నాసిర్ హుస్సేన్, వైస్ ఛైర్మన్లు, అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్