ఆదోని మున్సిపాలిటీ కార్యాలయంలో అపరిశుభ్రతపై డీవైఎఫ్‌ఐ ఆందోళన

ఆదోని మున్సిపాలిటీ కార్యాలయం చిన్నపాటి వర్షానికే జలమయమై అపరిశుభ్రతకు కేంద్రంగా మారిందని డీవైఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షులు సతీష్ వెంకటేష్ శనివారం విమర్శించారు. కార్యాలయ ప్రాంగణంలో వర్షపు నీరు నిల్వ ఉండటంతో సిబ్బంది, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, సమస్యను పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం లభించలేదని తెలిపారు. మున్సిపల్ కార్యాలయాన్నే సరిగా నిర్వహించలేని వారు పట్టణ ప్రజల సమస్యలను ఎలా పరిష్కరిస్తారని ప్రశ్నించారు. నీటి నిల్వ, పారిశుద్ధ్య సమస్యలను వెంటనే శాశ్వతంగా పరిష్కరించాలని డీవైఎఫ్‌ఐ డిమాండ్ చేసింది.

సంబంధిత పోస్ట్