కర్నూలు: రేపు పిజిఆర్ఎస్ కార్యక్రమం ఉదయం 9. 30కే ప్రారంభం

కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి ఆదివారం ఒక ప్రకటనలో, ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పిజిఆర్ఎస్) కార్యక్రమం సోమవారం ఉదయం 9.30 గంటలకే ప్రారంభమవుతుందని తెలిపారు. ఎండల తీవ్రత దృష్ట్యా, జిల్లా, డివిజన్, మండల స్థాయిల్లో జరిగే ఈ కార్యక్రమాన్ని సాధారణ సమయానికి ముందే ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. ప్రజల నుంచి వినతులు స్వీకరించే ప్రక్రియను ఉదయం వేళల్లోనే పూర్తి చేయాలని సూచించారు. ఈ మార్పును గమనించి ప్రజలు సమయానికి హాజరై తమ సమస్యలను వినిపించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్