కర్నూలు జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి సోమవారం అధికారులను ఆదేశించారు. పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించిన కౌతాళం ఈవోఆర్డీ, ఆదోని డివిజన్ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ సర్వే, ఎమ్మిగనూరు ఈవోఆర్డీలకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని తెలిపారు. ఆదోని క్రాంతి నగర్ వార్డు ప్లానింగ్ సెక్రటరీ 9 రోజులుగా అర్జీలు పెండింగ్‌లో ఉంచినట్లు గుర్తించి మున్సిపల్ కమిషనర్ నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు.