నిజాముద్దీన్ కాలనీలో మహిళల భద్రతపై పోలీసుల అవగాహన

ఆదోని నిజాముద్దీన్ కాలనీలో మంగళవారం మహిళల భద్రతపై పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం జరిగింది. వన్ టౌన్ ఎస్సై, పోలీస్ సిబ్బంది, వైఎస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి, కౌన్సిలర్ ఫయాజ్ అహ్మద్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మహిళలకు ధైర్యం చెప్పి, ఏ సమస్య వచ్చినా భయపడకుండా పోలీసులను సంప్రదించాలని సూచించారు. ఫేక్ కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని, వ్యక్తిగత వివరాలు తెలియజేయడంలో జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. మహిళల భద్రతకు పోలీసులు ఎప్పుడూ అందుబాటులో ఉంటారని, సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి కాలనీవాసులు, మహిళలు హాజరయ్యారు.

సంబంధిత పోస్ట్