నారాయణపురంలో ఎస్సై మహిళా భద్రతా అవగాహన సదస్సు

ఆదోని మండలంలోని ఇస్వీ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం నారాయణపురం గ్రామంలో మహిళల భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఎస్పీ విక్రాంత్ పాటిల్, డీఎస్పీ ఆదేశాల మేరకు ఎస్సై మహేష్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సదస్సులో, చట్టవ్యతిరేక కార్యక్రమాలు, జూదం, అక్రమ సారా వంటి వాటిపై పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై మహేష్ కుమార్ తెలిపారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ సమాజహిత కార్యక్రమాలలో పాల్గొనాలని సూచించారు.

సంబంధిత పోస్ట్