ఆళ్లగడ్డ: ప్రత్యేక బస్సులో కలెక్టర్, అధికారుల పర్యటన

ఆళ్లగడ్డ నియోజకవర్గంలో నిర్వహిస్తున్న “ఒక నెల – నాలుగు పర్యటనల” సమస్యల పరిష్కార కార్యక్రమంలో పాల్గొనేందుకు కలెక్టర్ రాజకుమారి, జేసీ సూరజ్ ధనుంజయ్‌తో పాటు జిల్లా అధికారులు ప్రత్యేక బస్సులో కలిసి ప్రయాణించారు. ఇంధన పొదుపు, పర్యావరణ పరిరక్షణ, సామూహిక బాధ్యతను ప్రోత్సహించేలా ఈ చర్య చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రయాణం ద్వారా ఇంధన ఆదా చేయడంతో పాటు పర్యావరణాన్ని పరిరక్షించడం, అందరూ కలిసికట్టుగా బాధ్యత తీసుకోవడం వంటి అంశాలను ప్రోత్సహించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.

సంబంధిత పోస్ట్