స్వచ్ఛమైన, నిర్దిష్టమైన ఓటర్ల జాబితా రూపకల్పనలో భాగంగా నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ రాజకుమారి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. దొర్నిపాడు మండలం గుండుపాపల గ్రామ సచివాలయ పరిధిలోని ఉమాపతినగర్‌లో ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలను తనిఖీ చేశారు. నమోదు ప్రక్రియపై అధికారులకు సూచనలు చేస్తూ సెన్సస్‌ను సమర్థవంతంగా నిర్వహించాలని ఆదేశించారు.