ఆస్పరి: ఊడిన ఆర్టీసీ బస్సు టైర్లు.. తప్పిన ప్రమాదం

ఆదోని నుండి పత్తికొండ వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఆస్పరి సమీపంలో ప్రమాదానికి గురయ్యే స్థితికి చేరుకుంది. మంగళవారం, బస్సు టైర్లు పూర్తిగా విడిపోయే స్థితికి చేరుకున్నాయని గుర్తించిన డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించి బస్సును పక్కకు ఆపడంతో పెను ప్రమాదం తప్పింది. దీనితో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. పాత బస్సుల వినియోగం, సరైన నిర్వహణ లోపం వల్ల ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని, ఇది ప్రయాణికుల భద్రతకు ముప్పుగా మారుతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్