ఆస్పరి దేవనకొండ మండలాల మధ్య ఉన్న అలారదిన్నె బ్రిడ్జి పూర్తిగా దెబ్బతిని, భారీ రంధ్రాలు ఏర్పడటంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. బుధవారం బీఎస్పీ తాలూకా అధ్యక్షులు కొమ్మ రమేష్ మాట్లాడుతూ, కర్నూలు-బళ్లారి ప్రధాన రహదారిపై ఉన్న ఈ బ్రిడ్జి సమస్యను పట్టించుకోవడం లేదని, ఇప్పటికైనా కలెక్టర్ కొత్త బ్రిడ్జి నిర్మాణానికి ప్రతిపాదనలు పంపాలని డిమాండ్ చేశారు.