కర్నూలు: ప్రజా ఫిర్యాదులను వేగంగా, నాణ్యతతో పరిష్కరించాలి

కర్నూలు జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి, ప్రజా ఫిర్యాదులను నాణ్యతతో, వేగంగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుండి వినతులు స్వీకరించారు. ప్రతి ఫిర్యాదును జాగ్రత్తగా పరిశీలించి, గడువులోపు పరిష్కరించాలని, ఎట్-టు-వ్యూలో ఒక్క అర్జీ కూడా పెండింగ్‌లో ఉండకూడదని సూచించారు. అధికారుల లాగిన్‌లోకి వచ్చిన అర్జీలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ చర్యలు తీసుకోవాలని తెలిపారు.