కర్నూలు: మత్తు పదార్థాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు

కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి, జిల్లాలో మత్తు పదార్థాల వినియోగం, అక్రమ రవాణా, విక్రయాలను పూర్తిగా అరికట్టేందుకు అన్ని శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో జరిగిన నార్కోటిక్స్ కోఆర్డినేషన్ కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడుతూ, యువత దేశ భవిష్యత్తు అని, మాదక ద్రవ్యాల వ్యసనం యువత జీవితాలతో పాటు కుటుంబాలు, సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. జిల్లాలో గంజాయి, నిషేధిత మత్తు పదార్థాల అక్రమ రవాణా, నిల్వలు, విక్రయాలపై నిరంతర నిఘా కొనసాగించాలని పోలీసు, ఎక్సైజ్, విద్యా, వైద్య ఆరోగ్య శాఖల అధికారులను ఆదేశించారు.

సంబంధిత పోస్ట్