ఆలూరులో మహిళా చైతన్య సదస్సు విజయవంతం

కర్నూలు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఆలూరులో మంగళవారం మహిళా చైతన్య అవగాహన సదస్సు విజయవంతంగా ముగిసింది. మహిళా భద్రత, హక్కులపై అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన ఈ సదస్సుకు టీడీపీ ఇన్‌చార్జి వైకుంఠం జ్యోతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్, డీఎస్పీ వెంకట్రామయ్య, ఇతర పోలీస్ అధికారులు గౌరవ అతిథులుగా పాల్గొన్నారు. సదస్సులో మహిళల చట్టాలు, హక్కులు, సైబర్ నేరాలు, స్వయం రక్షణపై నిపుణులు వివరించారు. మహిళలు తమ హక్కులను తెలుసుకొని, భద్రతపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

సంబంధిత పోస్ట్