జాతీయ రహదారుల విస్తరణపై సీఎం చంద్రబాబు కీలక సమీక్ష

రాష్ట్రంలో జాతీయ రహదారుల ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన క్యాంప్ కార్యాలయంలో సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో జాతీయ రహదారుల నెట్‌వర్క్ విస్తరణ, రాష్ట్ర రహదారుల అభివృద్ధి, రోడ్ డెన్సిటీ పెంపు వంటి అంశాలపై చర్చించారు. ప్రస్తుతం కొనసాగుతున్న ఎన్‌హెచ్ ప్రాజెక్టుల పురోగతి, కొత్త రహదారుల నిర్మాణ ప్రణాళికలను ముఖ్యమంత్రి సమీక్షించారు. ప్రాజెక్టుల అమలులో ఏపీ దేశానికి బెంచ్‌మార్క్‌గా నిలవాలని, ప్రస్తుతం 2 లేన్లుగా ఉన్న జాతీయ రహదారులను దశలవారీగా 4 లేన్లుగా అభివృద్ధి చేయాలని సూచించారు.

సంబంధిత పోస్ట్