అవుకులో సర్వసభ్య సమావేశం

బనగానపల్లె నియోజకవర్గం అవుకు మండల సర్వసభ్య సమావేశంలో, మండల అధ్యక్షుడు చల్లా రాజశేఖర రెడ్డి సామాజిక ఆరోగ్య కేంద్రంలో భద్రతా చర్యలు బలోపేతం చేయాలని, గర్భకోశ వైద్యుల కొరతపై తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. విద్యాశాఖలో 92 ఉపాధ్యాయ ఖాళీలు ఉన్నట్లు వెల్లడైంది. తాగునీటి సమస్యలు లేకుండా చూడాలని, గ్రామాల్లో కుక్కల బెడద నివారణకు వ్యాక్సినేషన్, తరలింపు చర్యలు చేపట్టాలని సంబంధిత శాఖలకు ఆదేశాలు జారీ చేశారు.

సంబంధిత పోస్ట్