బనగానపల్లె తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం ఉదయం 9 గంటల నుంచి నిర్వహించే ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమానికి జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్ హాజరుకానున్నట్లు ఆర్డీవో నరేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో సమర్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ చంద్రశేఖర్‌తో పాటు ఇతర అధికారులు కూడా పాల్గొంటారు.