బనగానపల్లె పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులను బుధవారం మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి పరిశీలించారు. బనగానపల్లె–డోన్ రోడ్డులో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనులు, ట్రాఫిక్ సమస్యను తగ్గించనున్న బైపాస్ రోడ్డుపై పురోగతిని ఆయన ప్రత్యక్షంగా ఆరా తీశారు. ప్రభుత్వాసుపత్రిలో నిర్మాణంలో ఉన్న అన్న క్యాంటీన్ పనులను కూడా సమీక్షించి, నాణ్యతకు ప్రాధాన్యం ఇస్తూ త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.