డోన్ ఆర్టీవో పరిధిలోని అమకతాడు టోల్ ప్లాజా వద్ద శనివారం నిర్వహించిన తనిఖీల్లో నిబంధనలు ఉల్లంఘించిన నాలుగు కర్ణాటక ఇన్నోవా వాహనాలకు రూ. 62,300 జరిమానా విధించారు. రహదారి పన్ను చెల్లించకపోవడం, చెల్లుబాటు అయ్యే పర్మిట్ లేకపోవడం గుర్తించారు. వాహనాలను స్వాధీనం చేసుకుని ఆర్టీవో కార్యాలయానికి తరలించారు. ఇతర రాష్ట్రాల వాహనాలు నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ఎంవీఐ సూచించారు.